రవివర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోతో “రాక్షసుడు” రీమేక్!

రవివర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోతో “రాక్షసుడు” రీమేక్!

Published on Aug 22, 2020 1:16 AM IST

కోలీవుడ్ లో సంచలన విజయం అందుకున్న చిత్రం “రాట్సాసన్” ను తెలుగులో “రాక్షసుడు” గా తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న దర్శకుడు రవివర్మ. ఒరిజినాలిటీని ఎక్కడా పాడుచెయ్యకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. అలాగే హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో కూడా పెద్ద హిట్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని హిందీలో ఒక స్టార్ హీరోతో రీమేక్ చెయ్యనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. రేపు రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చెయ్యనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని అక్కడ కోనేరు సత్యన్నారాయణ ఏ స్టూడియోస్ పేరిట నిర్మించనున్నారు. ప్రస్తుతం రవివర్మ మాస్ మహారాజ్ రవితేజతో ఒక మాస్ ఎంటర్టైనర్ తీయనున్నారు దాని తర్వాత ఈ చిత్రాన్ని అక్కడ తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు