ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ ప్రాజెక్టులలో ముందు వరుసలో ఉన్న చిత్రం “రాధే శ్యామ్”. పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ వల్ల అందాక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ పునః ప్రారంభం కానుండడంపై అలా కొన్ని వార్తలు వచ్చాయి.
ఈ చిత్రం షూటింగ్ వచ్చే అక్టోబర్ మధ్య నుంచి మొదలు అవుతుంది అని బజ్ వినిపించగా అందుకు ఒక నెల ముందే సెప్టెంబర్ రెండవ వారం నుంచే తిరిగి ప్రారంభించనున్నామని దర్శకుడు రాధాకృష్ణ స్వయంగా అనౌన్స్ చేసాడు. మొత్తానికి మాత్రం ప్రభాస్ ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తే అప్డేట్స్ ఇవ్వరు అని అభిమానుల అభిప్రాయాన్ని కనిపించకుండా అప్డేట్ల వరద ఇప్పుడు వస్తుంది అని చెప్పాలి. ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఈ స్వచ్ఛమైన ఎమోషనల్ ప్రేమ కావ్యం వచ్చే ఏడాది వేసవి బరిలో ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.