మానస్ నాగులాపల్లి, మరియు “ఓ పిట్ట కథ” చిత్రంతో టాలీవుడ్ కుపరిచయం అయి ఆకట్టుకున్న ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, హీరోలుగా అక్షత సోనావని హీరోయిన్ గా అనిల్ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ”క్షీరసాగరమథనం” టీజర్ ను ఈరోజు ఆగష్టు 21న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేసారు. అలా విడుదల చేసి క్రిష్ తన ఖాతా ద్వారా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు ప్రేక్షకులు.. “క్షీర సాగర మథనం” చిత్రాన్ని తప్పక ఆదరిస్తారనే నమ్మకముంది. మా చిత్రం టీజర్ సంచలన దర్శకులు క్రిష్ చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది” తెలిపారు.
చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ఇక ఈ చిత్రానికి చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, ఫైట్స్: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్ లు అందిస్తుండగా సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి అందిస్తున్నారు.
"What wil you do if you are going to die in ONE hour?"
Here is the exciting n enthralling teaser of #KsheeraSaagaraMadhanam
from@Directoranilp @actormaanas @SanjayKOfficial@akshatasonawane@charishma_offcl@arasadaajay
@dopsantoshsmoni@creatorkrishhttps://t.co/BRgvfTllvk— Krish Jagarlamudi (@DirKrish) August 21, 2020