ఇంత గొడవ జరిగినా దిల్ రాజు కూల్‌గానే ఉన్నారు

ఇంత గొడవ జరిగినా దిల్ రాజు కూల్‌గానే ఉన్నారు

Published on Feb 10, 2021 11:33 PM IST

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీద ఇటీవల విమర్శలు పెరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను దిల్ రాజు మీద నేరుగానే విమర్శలు గుప్పించారు. ఈ గొడవ ‘క్రాక్’ సినిమా విషయంలో జరిగింది. తెలంగాణలో ‘క్రాక్’ చిత్రానికి సరిపడినన్ని థియేటర్లు ఇవ్వలేదని దీని వెనుక దిల్ రాజు ఉన్నారని, కావాలనే కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని, వేరొకరు ఏదిగితే తట్టుకోలేకపోతున్నారని వరంగల్ శీను నిప్పులు చెరిగారు. ఈ గొడవ పెద్ద వివాదాన్నే రేపింది. వరంగల్ శీను వాదనను కొందరు సమర్థిస్తే ఇంకొందరు మాత్రం విడుదల తేదీల దగ్గర వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగానే ఇలా జరిగిందని దిల్ రాజును సమర్థించారు.

ఇంత గొడవ జరిగినా దిల్ రాజు మాత్రం నోరుజారలేదు. సమ్యమనం పాటిస్తూ నిదానంగానే వ్యవహరించారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, ఇలాంటి విమర్శలు కామన్ అని అన్నారు. తాజాగా ఆయన మీద మరొక వార్త బయలుదేరింది. వివాదం జరిగినప్పటి నుండి దిల్ రాజు ప్రోడ్యూజర్స్ గిల్డ్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. దీని మీద ఒక ప్రముఖ పత్రికకు స్పందించిన దిల్ రాజు ‘పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఎండిపోయిన చెట్టుపై ఎవ్వరూ రాళ్ళు వెయ్యరు. ఆ నిజాన్ని నేను మరచిపోను. గిల్డ్ అనేది కౌన్సిలో, ఛాంబరో కాదు.. అందరం కలసి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వేదిక. వార్తలు దిల్ రాజు మీద రాస్తే చదువుతారు కదా’ అంటూ లైట్ తీసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు