అక్టోబర్ 24న విష్ణు చిత్రం భారీ విడుదల

అక్టోబర్ 24న విష్ణు చిత్రం భారీ విడుదల

Published on Oct 24, 2012 4:16 AM IST


విష్ణు మంచు కామెడి ఎంటర్ టైనర్ “దేనికయినా రెడీ” చిత్రం విజయదశమి సందర్భంగా అక్టోబర్ 24న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అయ్యింది. ఈరోజు ఈ చిత్రానికి సెన్సార్ వారితో ఉన్న విభేదాలన్నీ సమసిపోయాయి. విష్ణు చాలా రోజుల తరువాత పూర్తి కామెడి ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు గతంలో ఈయన నటించిన “డీ” చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక ప్రధాన పాత్ర పోషించింది. బ్రహ్మానందం మరియు ఎం ఎస్ నారాయణలు చిత్రం ఆసాంతం సాగే పాత్రలలో కనిపిస్తున్నారు వీరి పాత్రలు ఈ చిత్రంలో కీలకం కానుంది. చక్రి మరియు యువన్ శంకర్ రాజ సంగీత దర్శకత్వం అందించిన ఈ చిత్రాన్ని విష్ణు స్వయాన నిర్మించారు. అక్టోబర్ 24 పొద్దున్న ఈ చిత్ర లైవ్ అప్డేట్స్ 123తెలుగు.కాం లో ఉంటాయి మిస్ అవ్వకండి.

తాజా వార్తలు