సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేనికైనా రెడీ’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేనికైనా రెడీ’

Published on Oct 20, 2012 9:33 AM IST

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘దేనికైనా రెడీ’. ఈ చిత్రం నిన్న సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంది, సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న విడుదల చేయనున్నారు. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం మరియు ఎం.ఎస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా – చక్రి సంయుక్తంగా సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో విష్ణు కృష్ణ శాస్త్రి మరియు సులేమాన్ అనే రెండు వేరు వేరు పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు