విష్ణు సినిమాకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్

విష్ణు సినిమాకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్

Published on Oct 22, 2012 10:57 AM IST


మంచు విష్ణు హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘దేనికైనా రెడీ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ఒక్క ఆంధ్ర ప్రదేశ్లో తప్ప, మిగతా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న అన్ని ఏరియాల్లోనూ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో విడుదల చేస్తున్నారు. అబ్రాడ్ లో నివసిస్తున్న తెలుగు వారికి కొన్ని వైవిధ్యమైన డైలాగ్స్ మరియు పదాలు అర్థం కావు అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేసారు. సబ్ టైటిల్స్ ద్వారా అందరికీ సినిమా చేరువవుతుందని భావిస్తున్నారు.

విష్ణు సరసన హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. చక్రి మరియు యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్ పై విష్ణు నిర్మించారు. ఈ మూవీలో బ్రహ్మానందం మరియు ఎం.ఎస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు. ‘ఢీ’ సినిమా తర్వాత సుమారు 5 సంవత్సరాల గ్యాప్ తీసుకుని మంచు విష్ణు మళ్ళీ మరో కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తాజా వార్తలు