కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న మంచు వారబ్బాయి

కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న మంచు వారబ్బాయి

Published on Oct 19, 2012 3:35 PM IST


మంచు విష్ణు తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాడు. దేనికైనా రెడీ సినిమాని అమెరికాలో 5 నిమిషాల ప్రివ్యూ వేయబోతున్నారు. ఈ శనివారం అమెరికాలోని కొన్ని థియేటర్లలో 5 నిమిషాల ప్రివ్యూ వేయబోతున్నారు. సాధారణంగా అమెరికాలో ఇంగ్లీష్ సినిమాలకు మాత్రమే ఇలాంటి ప్రివ్యూలు వేస్తారు. అమెరికాలో 5 నిమిషాల ప్రివ్యూ వేసిన మొదటి తెలుగు సినిమాగా దేనికైనా రెడీ కొత్త ట్రెండ్ సృష్టించాబోతున్నారు. సినిమాకి విడుదలకి ముందు ఇలాంటి ప్రమోషన్ సినిమాకి బాగా ఉపయోగపడుతుంది. విష్ణు సరసన హన్సిక నటించిన ఈ సినిమా అక్టోబర్ 24న విడుదల కాబోతుంది. యువన్ శంకర్ రాజ, చక్రి సంగీతం అందించిన ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించారు.

తాజా వార్తలు