తమిళ స్టార్ నటుడు ధనుష్ తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇలా ఇండియన్ సినిమా నుంచి చాలా తక్కువమంది స్టార్స్ మాత్రమే ఉంటే అందులో ధనుష్ కూడా ఒకరు. మరి ధనుష్ హీరోగా ఈ ఏడాదిలో నటించిన మూడో సినిమా ఇప్పుడు రిలీజ్ కి వచ్చేసింది. ఆ సినిమానే “తేరే ఇష్క్ మేన్”.
కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఒక ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చింది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా ప్లాన్ చేశారు కానీ రాలేదు. అయినప్పటికీ హిందీలో షాకింగ్ ఓపెనింగ్స్ ని ధనుష్ సెట్ చేసేలా ఉన్నాడని బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
హిందీలో ధనుష్ చేసిందే చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈ సినిమాకి 15 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మేజర్ ఏరియాల్లో ఈ సినిమాకి మంచి బుకింగ్స్ నే ఉన్నాయట. దీనితో ధనుష్ సినిమా అక్కడి కొంతమంది యువ స్టార్స్ కూడా అందుకోని ఓపెనింగ్స్ పెట్టినా ఆశ్చర్యం లేదని తెలుస్తుంది. మరి ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.


