ఫోటో మూమెంట్: బ్యూటిఫుల్ పిక్ తో తమ బుజ్జాయి పేరు రివీల్ చేసిన కియారా!

ఫోటో మూమెంట్: బ్యూటిఫుల్ పిక్ తో తమ బుజ్జాయి పేరు రివీల్ చేసిన కియారా!

Published on Nov 28, 2025 12:00 PM IST

kiara-advani

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కియారా అద్వానీకి మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా తెలుగులో కూడా ఆమెకి మంచి ఆదరణ ఉంది. ఇక కొన్నాళ్ల కితం కియారా అలాగే తన భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి గుడ్ న్యూస్ కూడా షేర్ చేసింది. తాము ఇద్దరూ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు ఖరారు చేశారు.

ఇక లేటెస్ట్ గా మరో బ్యూటిఫుల్ పిక్ ని ఆమె షేర్ చేసి మా ప్రార్థనలు నుంచి మా చేతులలోకి వచ్చింది అంటూ తమ బుజ్జాయి పాదాలు చేతుల్లో చూపిస్తూ పెట్టిన పిక్ వైరల్ గా మారింది. ఇక ఇదే కాకుండా ఈ పోస్ట్ లోనే తమ కూతురు పేరు కూడా ఆమె రివీల్ చేసింది. ‘సరాయా మల్హోత్రా’ అంటూ ఈ ప్రపంచానికి ఆమెని పరిచయం చేసింది. దీనితో ఈ పేరు ఇపుడు ఫ్యాన్స్ లో రిజిస్టర్ అయ్యింది. ఇక రీసెంట్ గా వార్ 2 లో కియారా కనిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు