ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రవితేజ ‘మాస్ జాతర’

ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రవితేజ ‘మాస్ జాతర’

Published on Nov 28, 2025 8:00 AM IST

Mass-Jathara

మాస్ మహారాజ రవితేజ హీరోగా హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ లో దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మాస్ జాతర”. రవితేజ నుంచి మంచి కంబ్యాక్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా కూడా అభిమానులకి ఒకింత నిరాశనే మిగిల్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం బాగానే రన్ అయ్యిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఇక ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్లాట్ ఫామ్ లో నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా ఒక్క హిందీ మినహా అన్ని పాన్ ఇండియా భాషల్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అలాగే శ్రీకర వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు