ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ గతంలోనే రాగా, ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రపై అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యింది. కాగా, ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు ఇటీవల మరో తమిళ దర్శకుడు కథను వినిపించాడనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యాక్షన్ చిత్రాలను తనదైన మార్క్‌లో తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల అల్లు అర్జున్‌ని కలిశాడని తెలుస్తోంది.
అంతేగాక, అల్లు అర్జున్‌కు ఆయన ఓ కథను కూడా వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. మరి నిజంగానే అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.


