సర్ప్రైజ్ స్ట్రీమింగ్: కేవలం వారానికి ఓటీటీలో వచ్చేసిన యువ హీరో క్రైమ్ కామెడీ

సర్ప్రైజ్ స్ట్రీమింగ్: కేవలం వారానికి ఓటీటీలో వచ్చేసిన యువ హీరో క్రైమ్ కామెడీ

Published on Nov 28, 2025 7:00 AM IST

Paanch-Minar

ఇప్పుడు సినీ రంగంలో ఓటీటీల ప్రభావం ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిందే. వీటి మూలన ఎంత పెద్ద సినిమా అయినా నెల రోజుల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కానీ థియేటర్స్ లో విడుదల అయ్యిన ఒక్క వారంలోనే వచ్చిన కేస్ లు మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. అలా కేవలం వారానికే ఓటీటీలో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ కామెడీ సినిమా ఓటీటీలో దర్శనిమిచ్చింది.

గత శుక్రవారం థియేటర్లులో సినిమా విడుదల అయితే ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. అన్నట్టు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సర్ప్రైజ్ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేశారు. అయితే ఈ సినిమాకి రాజ్ తరుణ్ గత సినిమాల కంటే బెటర్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కేవలం ఈ 7 రోజులకే వచ్చేయడం గమనార్హం. ఇక ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించగా రామ్ కడుముల దర్శకత్వం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు