కోలీవుడ్ టాలెంటెడ్ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా ఇపుడు చేస్తున్న పలు చిత్రాల్లో మన టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రం “కుబేర” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ మాత్రం ఎప్పుడు రిలీజ్ అనేది అలా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆ మధ్య ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వచ్చింది.
అయితే ఇపుడు ఫైనల్ గా ఈ సినిమాకి కొత్త డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం కుబేర చిత్రం జూన్ 20న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇది దాదాపు ఫిక్స్ అని అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుంది అని టాక్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కింగ్ నాగార్జున సాలిడ్ రోల్ చేస్తున్నారు. అలాగే రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.