యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ రేపు భారీ విడుదలకు సిద్ధమవుతుండగా భారీ ఓపెనింగ్స్ కన్నేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఉన్న క్రేజ్ తో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి పలు నగరాల్లో ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్స్ రూపంలో టికెట్లు అమ్ముడుపోయాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. కీరవాణి సంగీతం అందించిన పాటలు సూపర్ హిట్ కావడం, ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్, పోస్టర్స్, ట్రైలర్స్ దమ్ము పై క్రీజ్ అమాంతం పెంచేస్తున్నాయి. వేసవి సెలవులు కూడా ఈ చిత్రానికి బాగా కలిసి రానున్నాయి. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం. ఎన్టీఆర్ కి జోడీగా త్రిషా, కార్తీక నటించిన దమ్ము సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.