టాలీవుడ్‌లో గతకొంత కాలంగా చర్చించబడుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. బలగం చిత్రం బ్లాక్‌బస్టర్ తర్వాత వేణు యెల్దండి డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ సినిమా గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు ఫాలో అవుతున్నారు.
అయితే, పలు పరిణామాల తర్వాత ఈ సినిమా హీరోగా దేవి శ్రీ ప్రసాద్ ఎంపికయ్యాడని తెలుస్తోంది. రీసెంట్‌గా నితిన్ ఈ సినిమాకు ఓకే చెప్పాడని.. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ అవకాశం దేవి శ్రీ ప్రసాద్ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడినట్లు చిత్ర వర్గాల టాక్.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు లాస్ట్‌గా కీర్తి సురేష్ ఓకే చెప్పిన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, నితిన్‌తో ఆమె గతంలో సినిమా చేసిందనే కారణంతో ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పి ఉంటుందని.. మరి ఇప్పుడు నితిన్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ రావడంతో కీర్తి సురేష్ ఈ సినిమాలో కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.