పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని నైజాం ఏరియాలో తెలంగాణా వాదులు సినిమాని నిలిపివేసినప్పటికీ మిగతా అన్ని ఏరియాల్లో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఒక్క సీడెడ్ లోనే కొంత కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి కానీ వారాంతం మరియు దసరా ఉండడంతో పుంజుకునే అవకాశం ఉంది. ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ షేర్ సుమారు 9 కోట్లు, ఇది ఒక రికార్డ్. కృష్ణా జిల్లాలో రెండవ రోజు కూడా సుమారు మొదటి రోజుతో సమానంగా 66 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది.
ఈ రోజు మధ్యాహ్నం వరకూ నైజాంలో షోలు ఉండవని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చెప్పిన సన్నివేశాలను పూరి జగన్నాథ్ మరియు దిల్ రాజు తొలగించేంత వరకూ ఇలానే కొనసాగే అవకాశం ఉందని సమాచారం. భారీ క్రేజ్ మరియు అంచనాలాతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతోంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మించారు.