ఆ బి – గ్రేడ్ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటున్న బ్రాహ్మణులు

ఆ బి – గ్రేడ్ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటున్న బ్రాహ్మణులు

Published on Oct 18, 2012 8:30 AM IST

“ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మనిజం” అనే చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలి అని పలు బ్రాహ్మణా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయం మీద గిడుగు రుద్ర రాజు మంత్రి డి కే అరుణ గారికి మెమొరాండం సమర్పించారు. ఈ చిత్రంలో కులాన్ని అవమానపరిచేలా సన్నివేశాల ఉన్నాయనీ సెన్సార్ వారు ఇలాంటి సన్నివేశాలను తొలగించాలని కోరారు. నిన్న యూట్యూబ్లో ఈ చిత్ర ట్రైలర్ అప్లోడ్ చేసిన తరువాత నుండి ఈ చిత్రం పలు విమర్శలకు దారి తీసింది. ఈ విషయమై డి కే అరుణ తగిన చర్యలు తీసుకుంటాను అని మాట ఇచ్చారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత చలం రాసిన పుస్తకం ఆధారంగా తెరకేక్కబడుతుంది. ఇందులో అయన రచించిన మంచి విషయాలను వదిలి శృంగారాన్ని మాత్రమే చూపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం లో బడ్జెట్ లో తెరకెక్కుతున్న బి-గ్రేడ్ చిత్రం.

తాజా వార్తలు