తుది శ్వాస విడిచిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు

తుది శ్వాస విడిచిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు

Published on Dec 29, 2012 4:00 AM IST

“అమనథ్” ఈ 23 ఏళ్ళ మెడికల్ స్టూడెంట్ ని ఢిల్లీలో ఆరు మంది అతి దారుణంగా కొట్టి రేప్ చేశారు. ఇన్నిరోజులు హాస్పిటల్ లో చావుబతుకుల మధ్య పోరాడిన ఈమె పై చివరికి చావే గెలిచింది. గత 12 రోజులుగా చికిత్స పొందుతున్న అమనథ్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచింది. మెరుగయిన చికిత్స కోసం అమనథ్ ను సింగపూర్ తీసుకెళ్ళారు అక్కడ ప్రఖ్యాత మౌంట్ ఎలిజెబెత్ హాస్పిటల్ లో చేర్పించారు. శుక్రవారం రాత్రి అక్కడ వైద్యులు ఆమె పరిస్థితి విషమించింది అని ప్రకటించారు. అమనథ్ మీద జరిగిన అత్యాచారం దేశంలో పలు నిరసనలకు దారి తీసింది ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను ఉరి తీయాలని పలువురు కోరుతున్నారు. మరి వారికి ఎటువంటి శిక్ష పడుతుందో వేచి చూడాల్సిందే. అమనథ్ ఆత్మ శాంతించాలని కోరుకుందాం.

తాజా వార్తలు