మహేష్ బాబు ఒక సరైన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మందికే ఉండి ఉంటుంది ఎందుకంటే మహేష్ స్టాండర్డ్స్ కు కానీ అతని లుక్స్ అండ్ యాక్షన్ కు అక్కడ సినిమాలు కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయని ప్రతీ ఒక్కరికీ ఉన్న అభిప్రాయమే. కానీ ఇప్పటి వరకు కూడా మహేష్ నుంచి ఆ కదలికలు అయితే కనిపించలేదు.
కానీ లేటెస్ట్ సర్కారు వారి పాట తో ఆ సూచనలు ఉండొచ్చేమో…అన్న సంకేతాలు ఉన్నాయి. కానీ బాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత మహేష్ తో రామాయణం తీయాలని అనుకుంటున్నారని అది కూడా భారీ బడ్జెట్ తో 3డి టెక్నాలజీలో ప్లాన్ చేస్తున్నారని చాలా మందికి వినిపించని టాక్.
కానీ అక్కడి సినీ వర్గాలు మాత్రం అది నిజమే అని చెబుతున్నాయి. బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాలు నిర్మాణం వహించిన మధు మంటెన మహేష్ ను రామునిగా అక్కడి స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ను సీతగా పెట్టి రామాయణం తీయాలని భావిస్తున్నారట. అలాగే దీపికా పదుకునేను లేటెస్ట్ గానే ఎంచుకున్నట్టుగా అక్కడ సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సాలిడ్ కాంబోపై మరింత సమాచారం రావాల్సియి ఉంది.