సౌత్ సినిమాల పై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస సినీ వీడియోలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. తాజాగా వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆచార్య టీజర్‌లో మెగాస్టార్ చిరంజీవి రోల్ తన ఫేస్ ను ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేశాడు. రీఫేస్ యాప్‌ను ఉపయోగించి చిరు ప్లేస్ లో వార్నర్ తన ముఖాన్ని పెట్టాడు. ఆచార్య టీజర్‌లో చిరు చెప్పిన పంచ్ డైలాగ్‌ను కూడా వార్నర్ చెప్పినట్టు ఎడిట్ చేశాడు.
పైగా గతంలో చేసిన కొన్ని వీడియోలలో తన భార్యతో పిల్లలతో సహా కలిసి డ్యాన్సులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు వార్నర్, ఈ స్టార్ క్రికెటర్ వీరబాదుడుకు స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు ఎన్నో. అదే జోష్‌ను టిక్ టాక్ పై కూడా కనబరుస్తున్నాడు వార్నర్. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న వార్నర్ తెలుగు సినిమాల పై ఇలా ఇంట్రస్ట్ చూపించడం బాగుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ ఇలా తెలుగు సాంగ్స్ కి మరియు డైలాగ్స్ కి వరుస వీడియోలు చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.
https://www.instagram.com/p/CKs1qnGFxu9/