విష్ణుకి అదృష్ట దేవతలు ఆ ఇద్దరే.!

విష్ణుకి అదృష్ట దేవతలు ఆ ఇద్దరే.!

Published on Oct 25, 2012 8:25 AM IST

మన చాలా మంది భారతీయ కుటుంబాల్లో పిల్లలు జన్మించిన రోజును ఒక పండగలా చేసుకుంటారు. వారికి పుట్టిన పిల్లల వల్లే వారికి అదృష్టం వరిస్తుందని వాళ్ళు బాగా నమ్ముతారు. ఇదే విషయం మంచు విష్ణుకి జన్మించిన అరియానా మరియు వివియానాల విషయంలో కూడా జరిగింది. మంచు విష్ణు హీరోగా చేసిన ‘దేనికైనా రెడీ’ సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమా ప్రారంభంలో ‘అరియానా మరియు వివియానా సమర్పించు’ అని వేశారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ ని తెచ్చుకోవడమే కాకుండా, అందరూ విష్ణుకి ఫోన్ చేసి శుభాకాంక్షలతో పాటు నీ కుమార్తెలు ఇద్దరూ నీకు అదృష్టాన్ని కూడా ఇచ్చారు అని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే విష్ణు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా కలెక్షన్స్ సాధించలేకపోతున్నాడు అనే పేరుని ఈ సినిమా తుడిచిపెట్టేసేలా ఉంది.

తాజా వార్తలు