‘ది ప్యారడైజ్’ ఫస్ట్ లుక్.. నాని ప్రపంచాన్ని పరిచయం చేసేది ఆరోజే..!

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ లుక్.. నాని ప్రపంచాన్ని పరిచయం చేసేది ఆరోజే..!

Published on Aug 6, 2025 4:45 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో దర్శుకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి నానితో కలిసి అంతకుమించిన సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్ర గ్లింప్స్ టాలీవుడ్‌ను షేక్ చేసింది.

నాని లాంటి హీరోను ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా శ్రీకాంత్ ఓదెల ప్రెజెంట్ చేస్తుండటంతో ‘ది ప్యారడైజ్’ పై అతిభారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నారు చిత్ర యూనిట్. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేస్తున్నట్లో ఓ కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.

తుపాకుల రాజ్యంలో నాని ఎలాంటి విస్ఫోటం సృష్టించి ఆ రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఎదుగుతాడా.. అనే విధంగా ఈ కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ తీర్చిదిద్దారు. ఈ పోస్టర్‌లో ఇంతటి కాన్సెప్ట్ దాగి ఉందా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రీ-లుక్‌తోనే సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చిన ‘ది ప్యారడైజ్’.. ఫస్ట్ లుక్‌ను ఎలా డిజైన్ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ చిత్రంలో రాఘవ్ జుయాల్, సోనాలీ కులకర్ణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా 2026 మార్చి 26న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

తాజా వార్తలు