టాక్.. “ది రాజా సాబ్” ట్రైలర్ కి డేట్, టైం ఫిక్స్?

the raja saab

పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు కలయికలో దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్”. మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తాలూకా మొదటి ట్రైలర్ ఈ కొన్ని రోజుల్లోనే రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ ని భారీ చిత్రం కాంతారా 1 తో మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది.

మరి క్లారిటీ ఎప్పుడు అనేది ఇపుడు తెలుస్తుంది. దీనితో ది రాజా సాబ్ ట్రైలర్ ఈ అక్టోబర్ 1న సాయంత్రం నుంచి అందుబాటులో ఉంటుంది అని టాక్. కాంతారా పైడ్ ప్రీమియర్స్ పడే అవకాశం ఉండగా దానితోనే ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 1 సాయంత్రం నుంచే వస్తుందట. ఇక ఆన్లైన్ లో కూడా కొంచెం అటు ఇటుగా అదే సమయంలో వస్తుందని ఇపుడు వినికిడి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version