‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నవంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
దీంతో ఈ టీజర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, ఈ టీజర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ఈ టీజర్‌పై ఆసక్తి పెరిగింది.
ఇక ఈ సినిమాలో సాక్షి మదోల్కర్ హీరోయిన్గా నటిస్తుండగా బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
