ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్‌కి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఈ సినిమా నుండి నాలుగో సింగిల్ సాంగ్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ పాటను అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ఇక ఈ పాటను నవంబర్ 12న సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాటను హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తుండగా ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.
