‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. గ్లింప్స్ లో హైలైట్స్ ఇవే !

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘RT 76’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఐతే, ఈ సినిమాకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరు ఖరారు. ఇక మేకర్స్ తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చాలా బాగా ఆకట్టుకుంటుంది, పైగా సంక్రాంతి పండుగ వైబ్‌ ను అందిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ రామ సత్యనారాయణ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇద్దరు హీరోయిన్ల నడుమ సాగే డ్రామా ఈ సినిమాలో హైలైట్ అయ్యేలా ఉంది.

ఇంతకీ, రామ సత్యనారాయణను నిరంతరం వేధిస్తున్న ప్రశ్న ఏమిటి ?, ఈ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి ? అనేది 2026 సంక్రాంతికి తేలనుంది. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ డీల్స్ కూడా పూర్తి అయ్యాయి. జీ గ్రూప్ భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. జీ 5 ఈ చిత్రాన్ని ప్రసారం చేయనుంది. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version