డిసెంబర్ మొదటి వారంలో, శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణతో పోటీ పడబోతున్నాడు. బాలయ్య అఖండ సీక్వెల్‌తో రాబోతున్న సమయంలో, శర్వానంద్ తన స్పోర్ట్స్ డ్రామా బైకర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పైగా బైకర్ గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమాను అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా నటించింది.
ఐతే, ఈ సినిమాలోని “ప్రెట్టీ బేబీ” అనే మొదటి పాటను నవంబర్ 11న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ హీరోహీరోయిన్లు బైక్‌పై ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ స్టిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ బైక్ రేసు నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 6న రిలీజ్ కానుంది.
