మురుగ దాస్, శివ కార్తికేయన్ ప్రాజెక్ట్ గ్లింప్స్ కి డేట్, టైం ఫిక్స్!

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన రీసెంట్ చిత్రం “అమరన్”తో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత తాను సాలిడ్ లైనప్ తో సిద్ధంగా ఉండగా ఈ సినిమాల్లో అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో కూడా ఒకటి. అయితే ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ పై ఇపుడు సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది.

దీనితో మేకర్స్ ఈ సినిమా తాలూకా టైటిల్ గ్లింప్స్ ని ఈ ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకి వదులుతున్నట్టుగా క్రేజీ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాకి మురుగదాస్ ఎలాంటి టైటిల్ ని లాక్ చేసారో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ ఇద్దరు స్టార్స్ ఆల్రెడీ వేరే వేరేగా సికందర్, పరాశక్తి అనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి ఈ ఏడాది లోనే విడుదల కానున్నాయి.

Exit mobile version