డమరుకం సినిమాలో గ్రాఫిక్స్ మెయిన్ హైలెట్


కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసి చిత్రం ‘డమరుకం’ చాలా రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. చిత్ర విడుదలకు ఇంత ఆలస్యం ఎందుకవుతుంది అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతుంది. అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్ మెయిన్ హైలెట్ గా తెర కెక్కుతుండటంతో విఎఫ్ఎక్స్ పనుల క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అధ్బుతంగా వచ్చేలా తీర్చిదిద్దుతుండటంతో ఆలస్యమవుతూ వస్తుంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిస్తున్నారు. నాగార్జున సరసన అనుష్క నటిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాసరెడ్డి డైరెక్షన్ వహిస్తున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై డాక్టర్ వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నా

Exit mobile version