చిన్న చిత్రాల మీద ప్రభావం చూపుతున్న డమరుకం

చిన్న చిత్రాల మీద ప్రభావం చూపుతున్న డమరుకం

Published on Oct 21, 2012 10:16 AM IST


కింగ్ అక్కినేని నాగార్జున “డమరుకం” చిత్రం ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్లో విడుదల చెయ్యనున్నారు. దసరాకి విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కాని విడుదల అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది తెలియట్లేదు. ఈ చిత్రం విడుదల ఇతర చిత్రాల విడుదల మీద ప్రభావం చూపే అవకాశాలున్నాయి. రానా దగ్గుబాటి “కృష్ణం వందే జగద్గురుం”, “గుండెల్లో గోదారి”, “ఎటో వెళ్లిపోయింది మనసు” వంటి చిత్రాలు నవంబర్లో విడుదల కానున్నాయి. “డమరుకం” చిత్రం విడుదల తేదీ ప్రకటించగానే పైన చెప్పిన చిత్రాల విడుదల తేదీలలో అయోమయం నెలకొనే పరిస్థితి ఉంది. “డమరుకం” చిత్ర విడుదల తేదీ గురించిన సంశయాలు ఈ వారంలోపల తీరిపోనున్నాయి. ఈ చిత్రానికి పరిశ్రమలో మంచి టాక్ ఉంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాదిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. నాగార్జున మరియు అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆర్ ఆర్ మోవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు