‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘డమరుకం’ సినిమా విడుదల కోసం ప్రస్తుతం రెండు తేదీలను పరిశీలిస్తున్నార. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 26న విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాకి ఉన్న ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల ఆ సమయానికి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇది కాకుండా ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయాలని లేదా సరైన రోజు చూసుకొని నవంబర్ మొదటి అర్ధ భాగంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్సియర్స్ మరియు నిర్మాతల మధ్య రిలీజ్ తేదీ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకొక రెండు రోజుల్లో విడుదల తేదీ తెలిసే అవకాశం ఉంది. అనుష్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివుని పురాణాన్ని థీంగా తీసుకొని తెరకెక్కించారు. భారీ గ్రాఫిక్స్ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ తో రానున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.