మళ్లీ వాయిదా పడ్డ డమరుకం

మళ్లీ వాయిదా పడ్డ డమరుకం

Published on Oct 18, 2012 7:20 AM IST

‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి చివరికి ఈ నెల 20 న విడుదల చేస్తున్నామని తెలిపారు, కానీ మళ్ళీ చివరి నిమిషంలో సినిమాని వాయిదా వేసారు. చాలా థియేటర్లలో మరియు మల్టీ ప్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్లో ఈ సినిమా టికెట్స్ కూడా ఇచ్చేసారు. ఈ విడుదల వాయిదా గురించి ఈ చిత్ర యూనిట్ తెలియ జేశారు. ఎప్పుడు విడుదల చేయనున్నారు అనేది త్వరలోనే తెలియజేస్తారు. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఏ  సర్టిఫికేట్ ఇచ్చారు. ‘డమరుకం’ని భారీ బడ్జెట్ తో మరియు హై విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారు. నాగ్ సరసన అనుష్క కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని దసరాకి విడుదల చేసి దసరా సెలవులని బాగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

తాజా వార్తలు