డమరుకం కాపీ కాదు

డమరుకం కాపీ కాదు

Published on Oct 17, 2012 10:03 PM IST


డమరుకం సినిమా ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహ’ అనే బుక్ ఆధారంగా రూపొందించారని వస్తున్న వార్తలపై నాగార్జున ఖండించారు. డమరుకం సినిమా ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహ అనే బుక్ ఆధారంగా తీసారనే పుకార్లు నా వరకు వచ్చాయి. ఆ బుక్ రచయిత అమీష్ త్రిపాఠి కూడా నాకు ఫోన్ చేసి అడిగారు. ఆయనకి డమరుకం సినిమా స్టొరీ చెప్పి ఈ సినిమాకి ఆ సినిమాకి సంబంధం లేదని వివరించాను. నాకు ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహ సినిమాగా తీయాలని ఉంది కానీ దానికి 200 కోట్ల పైన బడ్జెట్ అవుతుంది. ప్రముఖ హిందీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఆ బుక్ కి సంబందించిన హక్కులు తీసుకున్నారని తెల్సిందన్నారు.

తాజా వార్తలు