యంగ్ టైగర్ ఎన్.టి.అర్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘యమదొంగ’ లోని ‘రబ్బర్ గాజులు’ పాట గుర్తుందా? ఈ పాటను దలేర్ మెహంది పాడారు. ఉత్సాహంగా, మధురంగా సాగే ఈ పాట అప్పుడు మంచి పాపులారిటిని సాదించింది. ప్రస్తుతం దలేర్ మెహంది మరొకసారి ఎన్.టి.అర్ సినిమా ‘బాద్షా’లో పాడనున్నారు . సంగీత దర్శకుడు థమన్, దలేర్ మెహంది, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రిల ట్విట్టర్ లో ఫోటోని థమన్ పోస్ట్ చేశాడు.
ఈ సినిమా ఆడియోని మార్చ్ 10న, సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. దలేర్ మెహంది మరొకసారి ఎన్.టి.అర్ సినిమాలో పాడి మన అందరిని ఆకట్టుకోవాలని ఆశిద్దాం.