‘కుబేర’ ట్రైలర్ క్లారిటీ కోసం అంతా వెయిటింగ్!

‘కుబేర’ ట్రైలర్ క్లారిటీ కోసం అంతా వెయిటింగ్!

Published on Jun 13, 2025 11:02 AM IST

ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున కూడా సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెద్క్ సినిమానే “కుబేర”. ఇప్పుడు అంతకంతకు మంచి బజ్ ని పెంచుకుంటూ వెళుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు కూడా మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే కుబేర ప్రీరిలీజ్ సహా ట్రైలర్ లాంచ్ లు ఇవాళే జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

కానీ నిన్న జరిగిన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటనతో మేకర్స్ పోస్ట్ పోన్ చేసేసారు. దీనితో ఈవెంట్ మాత్రమేనా ట్రైలర్ కూడా వాయిదా పడిందా అనేది మాత్రం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సస్పెన్స్ గా మారింది. ఆల్రెడీ చాలా మంది ట్రైలర్ ఇవాళే వస్తుంది అని అనుకుంటున్నారు కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. సో ఈ ట్రైలర్ ఎప్పుడు అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు