పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఈ జూన్ 16న అవైటెడ్ టీజర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో కూడా విడుదలకి ప్లాన్ చేసిన ఈ టీజర్ ఇపుడు ఆన్లైన్ లో లీక్ అవ్వడం అనేది షాకింగ్ గా మారింది.
అయితే పలు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వీటిపై మేకర్స్ గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. టీజర్ లీక్ కంటెంట్ ఎవరి హ్యాండిల్ నుంచి కనిపించినా వాటిని సస్పెండ్ చేయడమే కాకుండా గట్టి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అని మేకర్స్ చెబుతున్నారు. దీనితో జాగ్రత్తగా రాజా సాబ్ ని సెలబ్రేట్ చేసుకుందాం అని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.