వైరల్: ఆఫ్ లైన్ లో ‘పెద్ది’ మాస్ మ్యానియా.. ఏరువాక పౌర్ణమి సంబరాల్లో రచ్చ

వైరల్: ఆఫ్ లైన్ లో ‘పెద్ది’ మాస్ మ్యానియా.. ఏరువాక పౌర్ణమి సంబరాల్లో రచ్చ

Published on Jun 13, 2025 10:05 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ని సెట్ చేసుకున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో దర్శకుడు బుచ్చిబాబు సానా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కూడా ఒకటి. అయితే సరిగ్గా ఐపీఎల్ ముందు బుచ్చిబాబు దింపిన పెద్ది ఫస్ట్ షాట్ గట్టిగా పేలింది. ఇక ఐపీఎల్ లోనే కాకుండా ఆఫ్ లైన్ కూడా మాంచి రీచ్ ని అందుకున్న ఈ గ్లింప్స్ లేటెస్ట్ గా ఏరువాక పౌర్ణమి సంబరాల్లో కూడా వైరల్ గా మారింది.

ఎమ్మిగనూరు, గుడికల్ గ్రామంలో యువత ఈ పండగను పెద్ది మోడ్ లో జరుపుకున్నారు. యువత సహా చిన్నారులు కూడా సాలిడ్ కాస్ట్యూమ్స్ పెద్ది బ్యాట్ లు పట్టుకొని చరణ్ చేసిన ఐకానిక్ షాట్ ని రీక్రియేట్ చేశారు. దీనితో ఆఫ్ లైన్ లో మాత్రం పెద్ది రచ్చ మాములు లెవెల్లో కొనసాగడం లేదని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు