అనుష్క, ప్రియమణిల పై కోర్టు కేసు

అనుష్క, ప్రియమణిల పై కోర్టు కేసు

Published on Mar 4, 2013 7:55 PM IST

Priyamani-anushka
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సినిమాల పైనా, సినిమా వాళ్ళ పైనా కోర్టు కేసులు వేసేస్తున్నారు. ఇప్పుడు అనుష్క, ప్రియమణి పైన మల్కాజగిరి కోర్టులో సుబుద్ధ అనే యాక్టివిస్ట్ కేసు వేసారట. ఇంతకీ ఈ కేసుకి కారణం ఏంటంటే అనుష్క, ప్రియమణి వాళ్ళ వస్త్రధారణతో సమాజాన్ని పాడుచేస్తున్నారంట.

ఈ వార్త సినీ ప్రముఖులకు దిగ్బ్రాంతిని మరియు కోపాన్నీ కలిగించింది. ఈ హీరోయిన్స్ మీద చర్యలు తీసుకుంటారో లేదో ఇంకా తేలవలసి ఉంది. ఈ కేసు మరో ప్రశ్నను రేకెత్తించింది. ఎందుకు అనుష్క మరియు ప్రియమణిల పైనే ఈ కేసు వేసారు?? వాళ్ళు మాత్రమే ఇలాంటి దుస్తులు ధరిస్తున్నారా??

తాజా వార్తలు