సుల్తాన్ బజార్లో తిరుగుతున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’


నితిన్ హీరోగా ప్రేమ్ సాయి అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులోని సుల్తాన్ బజార్లో జరుగుతుంది. ఫోటాన్ కథాస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రూపొందుతుంది. తమిళంలో జై హీరోగా ‘తమిళ్ సెల్వనుం తనియర్ ఆంజాలుం’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రేమ్ సాయి గతంలో ప్రభుదేవా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. ప్రముఖ నేపధ్య గాయకుడు కార్తీక్ సంగీత దర్శకుడిగా మారిన తరువాత తెలుగులో చేస్తున్న రెండవ చిత్రం ఇదే.

Exit mobile version