మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కీలక పాత్ర అయిన మెగాస్టార్ అనుచరుడి పాత్ర చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేయట్లేదట.
కాగా చిరంజీవి తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని సుజీత్ తో ఇప్పటికే చెప్పారట. సుజీత్ తెలుగు నేటివిటీకి దగ్గరగా లూసిఫర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఇక గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మిశ్రమ ఫలితాలను అందుకుంది.
అయినప్పటికి చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికే ఈ మూవీ రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఇంతకీ మెగాస్టార్ అనుచరుడి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ఆ పాత్ర సినిమాలోనే కీలకమైనది కాబట్టి.. క్రేజ్ ఉన్న హీరోనే నటించే అవకాశం ఉంది.