‘మహాసముద్రం’కి ‘ఆర్ఎక్స్ 100’కి కామన్ పాయింట్ ఉందా ?


దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ ఇచ్చినా రెండో సినిమాను సెట్ చేసుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. మధ్యలో నాగ చైతన్య లాంటి హీరోల కోసం ట్రై చేసినా సెట్ కాలేదు. చివరకు శర్వానంద్ సెట్ అయ్యాడు. మరొక ప్రధాన పాత్రను సిద్దార్థ్ చేయనున్నారు. ఇక కథానాయకిగా అదితిరావ్ హైదరి నటించనుంది. ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా హీరోయిన్ పాత్ర మీద అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో కూడ కథానాయిక పాత్ర చుట్టూనే కథ ఉంటుందట. ఆ పాత్ర వ్యక్తిత్వమే కథను మలుపుతిప్పుతుందని అంటున్నారు. అయితే అది ‘ఆర్ఎక్స్ 100’ కథానాయిక పాత్ర తరహాలో మరీ విపరీతంగా ఉండదని కానీ బలంగానే ఉంటుందని అంటున్నారు. కథానాయిక పాత్ర పేరు మహా కాబట్టి అందుకే సినిమాకు ‘మహాసముద్రం’ అనే పేరు పెట్టారట. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక క్రైమ్ అండ్ లవ్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటెర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Exit mobile version