కలెక్షన్ కింగ్ మొదటి సారి ఎక్కిన బెంజ్ కారు ఆయనదేనట.!

కలెక్షన్ కింగ్ మొదటి సారి ఎక్కిన బెంజ్ కారు ఆయనదేనట.!

Published on Oct 22, 2012 8:00 PM IST


కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కొంచెం గతంలోకి వెళ్లి కొన్ని గత స్మృతుల్ని తలుచుకున్నారు. అందులోనూ ఆయనకీ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఫ్యామిలీకి ఉన్న సంబంధాన్ని గురించి వివరించారు. ఆ విశేషాలేంటో ఆయన మాటల్లోనే ‘ అప్పట్లో నా నివాసం చెన్నైలో ఉండేది. ఒకరి ముఖ్యమైన వ్యక్తి పెళ్లి కోసమని వరగంల్ వెళ్ళవలసి వచ్చింది. హైదరాబాద్ వరకూ వచ్చాను, ప్రభాస్ నాన్న అయిన సూర్యనారాయణ రాజు గారికి ఫోన్ చేసి ఈ విధంగా వరంగల్ వరకూ వెళ్ళాలి, కొంచెం కారు కావాలి పంపగలరా అని అడిగాను. ఆయన ఏకంగా తను వాడే బెంజ్ కారుని పంపారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను మరియు నేను మొట్టమొదటి సారి ఎక్కిన బెంజ్ కారు కూడా ఆయనదే. అప్పటి నుంచే నాకు ఆ కుటుంబంతో మంచి సత్సంబందాలు ఉన్నాయని’ ఆయన అన్నారు. ఇంతకీ అటూ ఇటూ కాకుండా ఈ సమయంలో ఏ సంబంధం లేకుండా ఇదంతా మోహన్ బాబు గారు ఎందుకు చెప్పారా అనుకుంటున్నారా? ఉందండీ సంబంధం ఉంది.

అదేమిటంటే డా. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విష్ణు కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఆ సన్నివేశాలకు స్వయంగా ప్రభాస్ డబ్బింగ్ చెప్పారు. అందుకని ప్రభాస్ ఫ్యామిలీతో తనకు ఇప్పటి నుంచి కాదని ఎప్పటి నుంచో మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కలెక్షన్ కింగ్ తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

తాజా వార్తలు