తెలంగాణలో రాంబాబు సినిమా నిలిపివేత

తెలంగాణలో రాంబాబు సినిమా నిలిపివేత

Published on Oct 19, 2012 6:25 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని ఈ రోజు తెలంగాణలోని మల్టీ ప్లెక్సుల్లో నిలిపివేశారు. ఈ విషయంపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలు ఫిల్మ్ చాంబర్ తో మంతనాలు జరుపుతున్నారు మరియు ఇప్పటికే తెలంగాణ మనోభావాన్ని దెబ్బతీసే సన్నివేశాలను మరియు డైలాగ్స్ ని తీసేశారు. అయినా సరే ప్రస్తుతానికి సాయంత్రం ఫస్ట్ షో ఆపివేశారు. ఫిల్మ్ చాంబర్ తో జరిగే మంతనాలు ఫలిస్తే రాత్రికి షోలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ఇండస్ట్రీ వారు చాలా సాధారణంగానే తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఫిల్మ్ చాంబర్ ఏమంటుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాకు తెలియగానే ఈ విషయం గురించి మరిన్ని విశేషాలు మీకు తెలియజేస్తాము.

తాజా వార్తలు