రేపటి నుండి డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకోనున్న కెమెరామెన్ గంగతో రాంబాబు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కెమరామెన్ గంగతో రాంబాబు” చిత్రం రేపటి నుండి డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోనుంది. అక్టోబర్ 11న విడుదలకు సిద్దమయిన ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని సెప్టెంబర్లో పూర్తి చేసేయనున్నారు. ముందు ఈ చిత్రంలో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రం మెరుపు వేగంతో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.దీంతో అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తానన్న మాటను పూరి నిలబెట్టుకోనున్నారు. ఈ చిత్రంలో పవన్ పవర్ఫుల్ విలేఖరి పాత్రలో కనిపించనున్నారు పూరి మార్క్ వినోదాన్ని ఈ చిత్ర కథకు మేళవించారు.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version