పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా రెండు రోజులు కలెక్షన్స్ రిపోర్ట్ మాకు అందింది మరియు ఆ రిపోర్ట్ ని మీకు అందిస్తున్నాం. నిన్న నైజాంలో చాలా థియేటర్లలో షోలు లేకుండా నిలిపివేయడంతో 2వ రోజు కలెక్షన్లు కొంత తగ్గాయి. అలాగే శుక్రవారం పనిదినం కావడంతో మార్నింగ్ మరియు మాట్నీ షోలకుకూడా ఆ ప్రభావం ఉంది. శనివారం మరియు ఆదివారం కలెక్షన్స్ బాగా వస్తాయని అంచనా వేస్తున్నారు. నిన్న నైజాంలో తెలంగాణా వాదులు ఈ సినిమా నిలిపివేయడంతో నైజాం కలెక్షన్లకు కొంత అంతరాయం కలిగింది.
ఏరియా | – | కలెక్షన్స్ |
నైజాం | – | 3.98 కోట్లు |
సీడెడ్ | – | 2. 30 కోట్లు |
నెల్లూరు | – | 48.5 లక్షలు |
గుంటూరు | – | 1.42 కోట్లు |
కృష్ణా | – | 86 లక్షలు |
పశ్చిమ గోదావరి | – | 86 లక్షలు |
తూర్పు గోదావరి | – | 90.59 లక్షలు |
వైజాగ్ | – | 1.05 కోట్లు |
మొత్తం | – | 11.8604 కోట్లు |