2004 క్లాష్ 2026లో రిపీట్ కానుందా..?

2004 క్లాష్ 2026లో రిపీట్ కానుందా..?

Published on Aug 30, 2025 7:00 AM IST

టాలీవుడ్‌లో పండుగ సీజన్‌లో సినిమాలు క్లాష్ కావడం కామన్. అయితే, ఇలాంటి వాటిలో 2004 సంక్రాంతి బరిలో జరిగిన క్లాష్ మర్చిపోలేనిది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహా’ చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌తో రూపొందించిన అంజిపై ఆ సమయంలో భారీ హైప్ ఉంది. ‘లక్ష్మీ నరసింహా’ మంచి విజయాన్ని సాధించింది కానీ, అంజి చిత్రం నిరాశ మిగిల్చింది. అయితే, అదే సమయంలో రిలీజ్ అయిన ప్రభాస్ ‘వర్షం’ మాత్రం సాలిడ్ హిట్‌గా నిలిచింది. ప్రభాస్ కెరీర్‌లో స్టార్‌డమ్‌కి బాటలు వేయడంతో పాటు ప్రభాస్‌కి మొదటి బాక్సాఫీస్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది.

ఇలా 2004 సంక్రాంతికి జరిగిన క్లాష్ ఇప్పుడు రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. 2026లో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఇదే సమయంలో ప్రభాస్ ‘రాజా సాబ్’ను జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రీసెంట్‌గా బాలయ్య నటిస్తున్న ‘అఖండ 2’ సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడింది.

దీంతో ఇప్పుడు ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో వచ్చే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ టాక్. ఈ నేపథ్యంలో 2004లో జరిగిన క్లాష్ ఇప్పుడు 2026లోనూ జరిగే ఛాన్స్ ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఈసారి నిజంగా ఈ క్లాష్ జరిగితే ఏ హీరో హిట్టు కొడతాడో.. ఏ హీరో నిరాశను మిగిలిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు