ఓటీటీ డీల్ క్లోజ్ చేసిన ‘విశ్వంభర’.. డీటెయిల్స్ ఇవే..!

ఓటీటీ డీల్ క్లోజ్ చేసిన ‘విశ్వంభర’.. డీటెయిల్స్ ఇవే..!

Published on Aug 30, 2025 7:00 PM IST

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం ‘విశ్వంభర’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌కు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది.

తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ ముగిసినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ‘విశ్వంభర’ హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ హక్కుల డీల్ ద్వారా నిర్మాతలు హ్యాపీగా ఉన్నట్లు చిత్ర వర్గాల టాక్.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా ఈ చిత్రాన్ని 2026 వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు