చనిపోయాక కూడా అల్లు కనక రత్నమ్మ నింపిన వెలుగు.. మెగాస్టార్ నుంచి ఆ నిజం బయటకి

చనిపోయాక కూడా అల్లు కనక రత్నమ్మ నింపిన వెలుగు.. మెగాస్టార్ నుంచి ఆ నిజం బయటకి

Published on Aug 30, 2025 9:02 PM IST

chiranjeevi

ఈ ఉదయం మెగా ఫ్యామిలీ ఇంట తీరని విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. స్వర్గీయ అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనక రత్నమ్మ కన్ను మూశారనే వార్త అటు అల్లు, ఇటు కొణిదెల వారి ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. దీనితో ఇరు కుటుంబీకులు కలవడం ఆపై సినీ ప్రముఖులు కూడా తమ నివాళులు అర్పించడం జరిగింది.

అయితే ఈ సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ బయటకి వచ్చింది. అల్లు కనక రత్నమ్మ తనకి ఒకసారి చెప్పిన మాటని పంచుకున్నారు. ఒకనాడు మాటల్లో నేత్ర దానం అనే మాట తమ మధ్య వచ్చినపుడు తన అత్త గారు మనం చనిపోయాక కాలి బూడిద అయిపోయేదానికి చనిపోయాక ఉంచుకొని ఏం చేస్తాం సరే అన్నారు.

కానీ అప్పుడు ఆర్గాన్ డొనేషన్ కోసం సంతకాలు లాంటివి తీసుకోలేదు అని ఇదే మాటని అల్లు అరవింద్ కి చెబితే తాను అంగీకారం తెలిపాక తమ అత్తమ్మ కార్నియా తీసుకోవడం జరిగింది అని తెలపడం ఆవిడపై మరింత గౌరవాన్ని ఇపుడు తీసుకొచ్చింది. ఈ నిజాన్ని లేటెస్ట్ గా మెగాస్టార్ టీం వారు షేర్ చేయడంతో సినీ వర్గాల్లో అభిమానుల్లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు