లేడీ విలన్‌తో ‘కూలీ’ డైరెక్టర్ రొమాన్స్..?

లేడీ విలన్‌తో ‘కూలీ’ డైరెక్టర్ రొమాన్స్..?

Published on Aug 30, 2025 6:01 PM IST

Lokesh-Kanagaraj-Rachita-

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాతో కన్నడ బ్యూటీ రచితా రామ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలన్ షేడ్‌లలో కనిపించిన ఆమె నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పాత్రతోనే రచితా రామ్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, రచితా రామ్‌కి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కబోతోంది. దర్శకుడిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ తొలిసారి హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో లోకేష్‌కు జోడీగా రచితా రామ్ ఎంపికైనట్లు సమాచారం.

ఈ సినిమాను అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించనున్నారు. ఆయన గతంలో ధనుష్ హీరోగా వచ్చిన కెప్టెన్ మిల్లర్, కీర్తి సురేష్ నటించిన సాణి కాయిధం చిత్రాలకు దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని కోలీవుడ్ మీడియా చెబుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు